కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
మచిలీపట్నంలోని స్థానిక మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన BEL రిటైర్డ్ ఉద్యోగి మహమ్మద్ ఖాజా జ్ఞాపకార్థం, ఆయన భార్య ఖుర్షిద్ బేగం, కుమార్తె కైసర్ సుల్తానా యొక్క ఆర్థిక సాయంతో హ్యాపీ హోం ఫర్ గర్ల్స్ హాస్టల్, నోబుల్ కాలనీ, మచిలీపట్నం వద్ద ₹10,000 విలువైన ఫర్నిచర్ (8 కుర్చీలు, వుడెన్ బల్ల) వితరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది.
అధ్యక్షుడు వేణు కుమార్ మాట్లాడుతూ — “మానవత్వం మనిషికి ఉన్న గొప్ప విలువ. సేవ అనే పుణ్యకార్యం ద్వారానే మనం సమాజానికి వెలుగునిస్తాం. ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు మరెందరోకు ప్రేరణగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు వరప్రసాద్, సభ్యుడు రమణ, బి.వి.రావు లు పాల్గొన్నారు. హాస్టల్ వార్డెన్ లతాకుమారి, దాత కుటుంబ సభ్యులకు మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

