The Desk…Machilipatnam : ఘనంగా “పొగాకు రహిత యువత కార్యక్రమం 3.0” ప్రారంభం

The Desk…Machilipatnam : ఘనంగా “పొగాకు రహిత యువత కార్యక్రమం 3.0” ప్రారంభం

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మచిలీపట్నంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేషనల్ టోబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ (NTCP) ఆధ్వర్యంలో పొగాకు రహిత యువత కార్యక్రమం 3.0 “Tobacco Free Youth Campaign 3.0” కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా DM&HO డా. ఎ. వెంకటరావు మాట్లాడుతూ… ఇప్పుడు యువతలో పొగాకు వాడకం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇది కేవలం వారి ఆరోగ్యానికే కాకుండా, సమాజానికి కూడా పెనుముప్పుగా మారుతోంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అవసరమైన మార్పు తీసుకురాగలవు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల్లో, సమాజాల్లో పొగాకు వ్యసనాన్ని నిరోధించేందుకు ముందుకు రావాలి. యువతే రాబోయే భవిష్యత్తు – వారి ఆరోగ్యం మన బాధ్యత.

GGH సూపరింటెండెంట్ డా. ఆషా లత మాట్లాడుతూ… “పొగాకు వల్ల కలిగే హాని గురించి అందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు పొగాకు వాడకం మూలంగానే వ్యాధులకు గురయ్యారు. ఈ తరహా ప్రచార కార్యక్రమాలు సమాజంలో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తాయి.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మరియు ప్రజలకు పొగాకు వినియోగానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు, వాటిని ఎదుర్కొనే మార్గాలు, మానసిక స్థైర్యం పెంచే పద్ధతులపై వివరాలు ఇవ్వబడ్డాయి. మానసిక నిపుణులు, సామాజిక సేవకులు దీనిపై ప్రత్యేకంగా అవగాహన కలిగించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏ. వెంకట రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. GGH సూపరింటెండెంట్ డా. ఆషా లత, జిజిహెచ్ డిప్యుటి సూపరింటెండెంట్ డా. భరత్ సింగ్ నాయక్, సైకియాట్రీ విభాగాధిపతి డా. శ్రీ లక్ష్మి, NCD ప్రోగ్రాం ఆఫీసర్ డా. హిమ బిందు, NTCP సైకలాజిస్టు శ్రీ MVD సుబ్రహ్మణ్యేశ్వరరావు, సోషల్ వర్కర్ శ్యామల, నర్సింగ్ విద్యార్థులు మరియు సాధారణ ప్రజలు పాల్గొన్నారు.