The Desk…Machilipatnam : రాష్ట్రంలో వైకాపా అలజడలు సృష్టించాలని ప్రయత్నిస్తోంది : ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ

The Desk…Machilipatnam : రాష్ట్రంలో వైకాపా అలజడలు సృష్టించాలని ప్రయత్నిస్తోంది : ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

రాష్ట్రంలో అలజడలు సృష్టించాలని వైసీపీ పార్టీ కుట్రకు ప్రయత్నిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు మచిలీపట్నంలో ఆరోపించారు.

వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహ దహనం నిరసిస్తూ గురువారం ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంనుండీ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. జగన్ రెడ్డి డైరెక్షన్ తోని వైసీపీ నేతలు ఇటువంటి చర్యకు పాల్పడ్డారని కొనకళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత వైసిపి ప్రభుత్వ హయాంలో192 మంది దళితులు హత్య కాబడ్డారని రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులను అడ్డుపెట్టుకుని ఆ శాంతిని సృష్టించే విధంగా జగన్ కుట్రలకు తెరలేపుతున్నారని వైసీపీ చేస్తున్న ఈ కుట్ర రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు