- సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన గోడ పత్రిక ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ధరలతో సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు డ్రిప్, స్ప్రింకర్లు లభిస్తాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు.
సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డిఓ కే స్వాతి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ రత్నాచార్యులుతో కలిసి సూక్ష్మ నీటిపారుదల శాఖకు సంబంధించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన గోడ పత్రిక ఆవిష్కరించారు.
సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టే రైతులకు డ్రిప్, స్ప్రింకర్లు తక్కువ ధరకే లభిస్తాయని, ఆయా పరికరాలపై జిఎస్టి 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిందని, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2.5 శాతం తగ్గింపుతో పరికరాలను అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ కోరారు..