The Desk…Machilipatnam : జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తా : జేసీ నవీన్

The Desk…Machilipatnam : జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తా : జేసీ నవీన్

కృష్ణా జిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ :

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించి జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతన సంయుక్త కలెక్టర్ మల్లారపు నవీన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వంచే ఇటీవల నియమితులైన మల్లారపు నవీన్ బుధవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీ కిషోర్ పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, డీఎస్ఓ మోహన్ బాబు, బందరు ఆర్డిఓ స్వాతి, మార్కెటింగ్ ఏడి నిత్యానందం తదితర జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రాధిక, పలువురు కలెక్టరేట్ సిబ్బంది నూతన సంయుక్త కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎవరికీ అప్పగించిన పనులు వారు సజావుగా చేయాలని కలెక్టరేట్ సిబ్బందికి సంయుక్త కలెక్టర్ సూచించారు. తదనంతరం సంయుక్త కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారినని, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ప్రజా సమస్యలు, భూ సమస్యలు, ధాన్యం సేకరణ సమస్యలను ప్రభుత్వ నియమాల ప్రకారం శక్తి వంచన లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, జిల్లాలోని ప్రభుత్వ అధికారులందరూ, కలెక్టరేట్ సిబ్బంది, పాత్రికేయులు అందరి సహకారంతో ప్రజలకు మంచి సేవలు అందించే అవకాశం లభిస్తుందని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సంయుక్త కలెక్టర్ సమాధానం చెబుతూ తన స్వస్థలం తిరుపతి అని, అక్కడే విద్యాభ్యాసం చేశానని, సత్యసాయి జిల్లా పెనుగొండలో సబ్ కలెక్టర్ గా పనిచేశానని, శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణపొంది అక్కడే సంయుక్త కలెక్టర్ గా కూడా పనిచేశానన్నారు. సి ఆర్ డి ఏ లో అదనపు కమిషనర్ గా పనిచేశామన్నారు. ప్రస్తుతం రెండవసారి సంయుక్త కలెక్టర్ గా కృష్ణాజిల్లాలో పదవీ బాధ్యతలు స్వీకరించామన్నారు.

సిఆర్డిఏ పరిధిలో కృష్ణాజిల్లాలో కొన్ని ప్రదేశాలు వస్తాయని వాటి గురించి కొంతవరకు తెలుసునని సంయుక్త కలెక్టర్ చెప్పారు. తదుపరి సంయుక్త కలెక్టర్ జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీని కలెక్టరేట్లోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.