The Desk…Machilipatnam : పచ్చని మొక్కలే భవితకు ఆధారం.. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు

The Desk…Machilipatnam : పచ్చని మొక్కలే భవితకు ఆధారం.. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : జిల్లా పోలీస్ కార్యాలయం : ది డెస్క్ :

“స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు స్వయంగా మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ, హరితహారం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎస్పీ తెలిపారు.

సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పచ్చని వాతావరణం కారణంగా కలిగే ప్రయోజనాలు, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించడం కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అత్యంత ముఖ్యం అని తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ సత్యనారాయణ, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.