The Desk…Machilipatnam : కారుణ్య నియామకం కింద 9 మందికి నియామక పత్రాల అందజేత

The Desk…Machilipatnam : కారుణ్య నియామకం కింద 9 మందికి నియామక పత్రాల అందజేత

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.

శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో 9 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉత్తర్వు పత్రాలను అందించారు.

వారిలో ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్లు, ఒకరికి గ్రామ వార్డు సచివాలయం, మరొకరికి ఆఫీస్ సబార్డినేట్ గా నియమించారు.

ఉద్యోగం పొందిన వారు బాధ్యతగా వ్యవహరిస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వారికి సూచించారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు..