The Desk…Machilipatnam : ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి –– జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి –– జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల నుండి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు.

ఉద్యోగుల వివిధ సమస్యలను ఓపిగ్గా ఆలకించి ఆయన కొన్నిటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో మొత్తం 21 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత జిల్లా అధికారులు సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.కార్యక్రమంలో డీఆర్వో కే చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.