The Desk…Machilipatnam : పోర్టులో పచ్చదనాన్ని పెంపొందించడానికి చర్యలు –– జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : పోర్టులో పచ్చదనాన్ని పెంపొందించడానికి చర్యలు –– జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం: ది డెస్క్ :

మచిలీపట్నం పోర్టు ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

గురువారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏపీ మారిటైం బోర్డు, మెగా సంస్థ, రైట్స్, మున్సిపల్, అటవీ శాఖ అధికారులతో మచిలీపట్నం పోర్టు గ్రీన్ యాక్షన్ ప్లాన్ కు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోర్టు ప్రాంతంలోని 266 ఎకరాలలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినప్పటికీ.. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతిపాదించిన భూమిని అటవీ శాఖ అధికారులకు చూపించాలని, ఆలస్యం చేయకుండా మొక్కలు నాటాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారిణి సునీత, మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఏపీ మారిటైంబోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పల్లారావు, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ డిజిఎం రాఘవేంద్రరావు, రైట్స్ సోషల్ సేఫ్ గార్డ్ ధీరేంద్ర కుమార్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.