కృష్ణా జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయం : ది డెస్క్ :
కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతోంది. ఇప్పటివరకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది.
ఈరోజు 1,381 మెట్రిక్ టన్నులు జిల్లాకు వస్తున్నది.
ఇంకా 1,200 మెట్రిక్ టన్నులు జిల్లాకు అలాట్మెంట్ చేయబడింది.
అలాగే, వచ్చే పది రోజుల్లో మరో 8,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
యూరియా సరఫరా గురించి రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. వారి అవసరాలకు తగినట్టు టోకెన్ విధానం ద్వారా సరఫరా కొనసాగుతోంది.
అర్హత ప్రకారం ప్రతి రైతుకూ సరైన పరిమాణంలో యూరియా అందించేందుకు చర్యలు తీసుకోబడుతున్నాయని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర రావు తెలియజేశారు.
అనధికారంగా యూరియాను నిలువ చేసినా, అక్రమ రవాణా కి పాల్పడినా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అవాస్తవ ప్రచారం చేసినా, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
ప్రజలు ఇలాంటి సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలి.
అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో టోకెన్ సిస్టం అమలు చేయబడింది. నిఘా పెంచబడింది.
రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుందికాబట్టి, కృష్ణా జిల్లాలోని రైతులు ఎటువంటి అపోహలకు, ఆందోళనలకు గురికావలసిన అవసరం లేదు.
అధికారిక మార్గాల ద్వారా సరఫరా సక్రమంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం.
ఆర్. గంగాధరరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణాజిల్లా..