The Desk…Machilipatnam : మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం – జిల్లా ఎస్పీ

The Desk…Machilipatnam : మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం – జిల్లా ఎస్పీ

  • కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు,.,

కృష్ణాజిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయం : ది డెస్క్ :

బందరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తు బండారు గంగరాజు ఎస్ఐ – 4145 అనారోగ్య కారణంతో 03.03.2023 వ తేదీన మరణించగా, మంగళవారం ఆయన కుమారుడు బండారు.శశాంకా కు జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పిస్తూ నియామకపత్రాన్ని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు అందచేసారు.

▪️ఈ సందర్భంగా ఎస్పీ మరణించిన ఎస్సై కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖలో అంకిత భావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు.

▪️విధినిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, మనందరం ఒక పోలీసు కుటుంబమని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చునని ఎస్పీ వారికి భరోసా కల్పించారు.

▪️అదేవిధంగా విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, వృత్తి నైపుణ్యం పెంచుకొని అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికా