The Desk…Machilipatnam : బందరు హార్బర్‌కు నరసింహరావు పేరు పెట్టి గౌరవించుకుంటాం

The Desk…Machilipatnam : బందరు హార్బర్‌కు నరసింహరావు పేరు పెట్టి గౌరవించుకుంటాం

  • మచిలీపట్నాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చిన ఘనత నరసింహరావు దే
  • బందరు అభివృద్ధితో ఆయనకు ఘన నివాళి అర్పిస్తాం

నరసింహరావు స్పూర్తితో పని చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

శ్రమను నమ్ముకున్న నాయకుడు నడకుదిటి నరసింహరావు అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

మంగళవారం మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు 74వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. నడకుదిటి నరసింహరావు శ్రమను నమ్ముకున్నారు. నీతి నిజాయితీలతో జీవితాంతం బ్రతికారు.

ఆయన జీవితం తెరచిన పుస్తకం లాంటిది. బందరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన ఘనత నరసింహరావుగారికే దక్కుతుంది. ఎలాంటి రోడ్డు రవాణా సదుపాయాలు గానీ, కమ్యూనికేషన్ సదుపాయాలు గానీ లేని సమయంలోనే ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించారు.

గరాల దిబ్బకు బ్రిడ్జినిర్మాణం, రోడ్ల నిర్మాణం, పల్లెతుమ్మలపాలెం పోలాటితిప్పలో ఉప్పు పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి కల్పించారు. బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. అందుకే ఆయన కష్టానికి గుర్తుగా.. బందరు హార్బర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి హార్బర్‌కు ఆయన పేరు పెట్టుకుని గౌరవించుకుంటాం.

బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బీసీలకు చేసిన కృషికి చిహ్నంగా బందరులో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించబోతున్నాం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. నరసింహరావుగారు చూపిన అడుగు జాడల్లోనే నడుస్తాం. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనే మాకు స్పూర్తి ప్రధాత అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల జగన్నాధరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.