The Desk…Machilipatnam : దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత : జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు

The Desk…Machilipatnam : దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత : జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

దేశం కోసం నిస్వార్ధంగా ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యతనీ కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు అన్నారు. పింగళి వెంకయ్య ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని.. ఆయన జయంతి పండుగగా చేసుకోవాలన్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటువంటి గొప్ప వ్యక్తి కృష్ణాజిల్లా వాసి కావడం మన అందరికీ గర్వకారణం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని, పింగళి స్వగ్రామం బట్ల పెనుమర్రు లో ఒకరోజు పల్లె నిద్ర చేసి ఆ గ్రామ ప్రజలతో మమేకమవుతామని తెలిపారు.

కృష్ణా జిల్లా వాసి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం నేడు భారతదేశ జనాభా కి స్ఫూర్తిదాయకమని అది జిల్లాకే గర్వకారణం అని అన్నారు జాతీయ పతాక యొక్క గుర్తింపును ఆ జెండా రంగుల గురించి విద్యార్థులకు జిల్లా ఎస్పీ వివరంగా తెలియజేశారు.

సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ నేటి తరాలకి తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో పింగళి వెంకయ్య చరిత్రను ముద్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంలో పింగళి వెంకయ్య కాంశ్య విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు.

పింగళి వెంకయ్య చరిత్రను నేటి యువతరానికి అందించాలని ప్రభుత్వ పరంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.వెలుగు పౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పింగళి వెంకయ్య కాంస్య విగ్రహాన్ని నిర్మాణం చేపట్టి పింగళికి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలన్నారు.

కార్యక్రమంలో బందర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు, స్టార్ కాలేజీ డైరెక్టర్ శ్రీరామ్, వెలుగు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రేపల్లె వసంతరావు బందరు డి.ఎస్.పి రాజా, పోలీస్ సిఐలు, సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు, స్టార్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు జిల్లా ఎస్పీ స్వీట్లు పంపిణీ చేసి వారితో ఫోటోలు దిగి ఉత్సాహపరిచారు.