The Desk… Machilipatnam : రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు  కొనుగోలుకు చర్యలు

The Desk… Machilipatnam : రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలుకు చర్యలు

  • జిల్లాలో ఇప్పటివరకు 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
  • రూ. 280 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర.

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : THE DESK :

రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం సేకరణ, రైతుల సమస్యలపై సమీక్షించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… వాతావరణ మార్పుల వల్ల ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం దిగుబడి అంచనా 9.79 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. దీనిలో స్థానిక వినియోగం పోను సుమారు 5.50 లక్షల m.t. దాన్యం సేకరణకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.

ప్రతి ఏడాది నవంబర్ నెలలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేదని, అయితే ఈ నవంబర్లో 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, కారణం మెషిన్ కటింగ్ వల్ల లోడింగ్, అన్ లోడింగ్, ఒకేసారి ధాన్యం రావడం మిల్లుల వద్ద రద్దీ ఏర్పడడం, తేమ శాతం లో గందరగోళ పరిస్థితులు వల్ల సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. దీనిపై మిల్లర్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు.

దీన్ని అధ్యయనం చేసి ఎంత స్టాక్ ఉన్నాయి, ఇంకా ఎంత పరిమాణం తీసుకోవచ్చు మిల్లర్లు లెక్కించుకుని రైతుల వద్ద నుండి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినట్లు మంత్రి తెలిపారు.నిబంధనల మేరకు తేమశాతం 17 కాగా, దీనికి 5 శాతం ఎక్కువగా ఉన్న దాన్యం సేకరించాలని, రైతులకు మద్దతు ధరలు తగ్గించకూడదని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి తెలిపారు.

మరోవైపు దళారులపై చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు.గతంలో ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు రెండు నెలల జాప్యం జరిగేదని, అయితే తమ ప్రభుత్వం 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 280 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.ధాన్యం సేకరణ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించారని, ఈరోజు అవనిగడ్డ ప్రాంతంలో పర్యటించి రైతులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తున్నరని తెలిపారు.

తొలుత సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ధాన్యం సేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, మిల్లర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.