- డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : ది డెస్క్ :
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించిన “డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
▪️ “ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం పోలీస్ శాఖ యొక్క ప్రథమ బాధ్యత అని, ‘డయల్ యువర్ ఎస్పీ‘ ద్వారా ప్రజలకు నేరుగా న్యాయం కల్పించడమే మా లక్ష్యమన్నారు.
▪️ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
▪️ఈ కార్యక్రమంలో అనేక మంది తమ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సివిల్ వివాదాలు ఇతర రకాలైన అంశాలపై ఫిర్యాదులు చేశారు.
▪️వాటిపై సంబంధిత అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అన్ని ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి, న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.
▪️ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని, సమాజపరంగా, కుటుంబ పరంగా, ఇతర రకాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని పోలీసువారి సేవలను పొందవచ్చని తెలిపారు.