The Desk…Machilipatnam : తీర ప్రాంత భద్రత మరింత పటిష్ట పరచండి – జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు

The Desk…Machilipatnam : తీర ప్రాంత భద్రత మరింత పటిష్ట పరచండి – జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు

కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లా పోలీస్ : ది డెస్క్ :

జమ్మూ కాశ్మీర్ పరిధిలోని పహల్గాం నందు ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లకుండా, ప్రజాజీవనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర డి.జి.పి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

▪️భూభాగాల ద్వారానే కాకుండా జలమార్గం ద్వారా శత్రువులు ఎవరు జిల్లాలోకి ప్రవేశింపకుండా సముద్రతీరం వెంబడి భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు.

▪️అందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు గిలకలదిండి సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించి, గిలకలదిండి న్యూ ఫిషింగ్ హార్బర్ నుండి పడవ ద్వారా మెరైన్ పోలీసులతో కలిసి మొగ వరకు వెళ్లి అక్కడి రక్షణా పరిస్థితులను పరిశీలించారు.

▪️అనంతరం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిశీలించి, అక్కడ ఎన్ని బోట్ లు ఉన్నది, వాటి పనితీరు, ఎంతమంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నది ఎస్సై బోస్ గారిని అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీ మాట్లాడుతూ…

▪️ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత భూభాగంలోనికి శత్రువులు చొచ్చుకురాగలిగే ప్రదేశాలన్నిటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

▪️కృష్ణాజిల్లా పరిధిలో సముద్రతీర ప్రాంతాలైన గిలకలదిండి,వర్లగొంది తిప్ప, పోలాటితిప్ప పరిసర ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమెరాలతో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామన్నారు.

▪️అనుమానిత వ్యక్తులు యొక్క కదలికలు గుర్తిస్తే వారిని ఎదుర్కొనేందుకు వీలుగా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

▪️సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను పోలీసు అధికారులు తరచు విజిట్ చేస్తూ, నిఘ వ్యవస్థను, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని తెలిపారు.