The Desk…Machilipatnam : 60 కేజీల గంజాయి పట్టివేత… ముగ్గురి అరెస్ట్

The Desk…Machilipatnam : 60 కేజీల గంజాయి పట్టివేత… ముగ్గురి అరెస్ట్

  • విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించిన జిల్లా ఎస్పీ ఆర్ . గంగాధరరావు

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

కృష్ణాజిల్లా ఎస్పీ R. గంగాధర్ రావు మరియు ఈగల్ టీం కు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ది 28.03.25 సాయంత్రం పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు.

అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఏర్టిగా కారును తనిఖీ చేయగా.. అందులో గంజాయిని గుర్తించారు. వెంటనే ఉంగుటూరు మండల తాసిల్దార్ అయిన జి. విమల కుమారి ని పిలిపించి, వారి ఆధ్వర్యంలో పూర్తీ తనిఖీలు నిర్వహించి, కారులో మూడు బస్తాల్లో ప్యాకింగ్ చేసిన 60 కేజీల గంజాయిని మరియు అందులో ప్రయాణిస్తున్న చంటిబాబు, సంతోష్, భాస్కర్ అను ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివారు శివిడిమామిడికి చెందిన దలాయి చంటిబాబు, గంజాయి సేకరించి, అమ్ముతుంటాడు. అలా అతను వద్ద గంజాయి కొనుక్కెళ్తూ, కొంతమంది పోలీసులకు పట్టుబడటంతో, వారితో పాటు చంటిబాబు మీద కూడా ఇప్పటి వరకు పాడేరు లో రెండు కేసులు, అనకాపల్లి రూరల్ పోలిస్ స్టేషన్ లో ఒక కేసు, సూళ్ళూరు పేట పోలిస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయ్యింది. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

అయినా బుద్ధి మార్చుకోక మరల కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా లోని జంగి గ్రామానికి చెందిన సంతోష్ అను వ్యక్తికి గంజాయి సేఫ్ గా డెలివరీ చేస్తాను అంటూ హైదరాబాదుకు చెందిన భాస్కర్ అను కారు యజమానితో కిరాయి మాట్లాడి 60 కేజీల గంజాయిని నిన్న తెల్లవారుజామున, సివిడిమామిడి లోని తన ఇంటి వద్దే లోడ్ చేయించి కర్ణాటక తీసుకు వెళ్తుండగా పొట్టిపాడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు.

కర్నాటకలోని బీదర్ జిల్లా ఔరాద్ తాలూకాకి చెందిన సంతోష్ గతంలో గేదెలు మేపేవాడు. తరువాత పాల వ్యాపారం చేసాడు. తన దగ్గరి బందువు అయిన అదే గ్రామానికి చెందిన దసరథ్ అనే అతని సూచనల ప్రకారం గంజాయి డీల్ మాట్లాడుకున్నాడు. 60 కేజీల గంజాయి కోసం అడ్వాన్స్ గా 64 వేల రూ.లు చంటిబాబు అకౌంట్ కి ట్రాన్సఫర్ చేసారు. హైదరాబాద్ కి చెందిన భాస్కర్ అనే అతన్ని కలుపుకొని, కారు మాట్లాడుకొని పాడేరు వచ్చి మూడు బస్తాల్లో గంజాయి లోడ్ చేసుకొని తిరిగి ప్రయాణం అయ్యారు.

తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ కి చెందిన మూడావత్ భాస్కర్ గతంలో కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. ప్రస్తుతం తనే సొంతంగా సుధాకర్ అనే వ్యక్తీ యొక్క ఆర్దిక సహాయంతో ఒక ఎర్టిగా కారు కొని, గంజాయి రావాణా చేసే నిందితులతో చేతులు కలిపాడు.

భాస్కర్ తండ్రి హైదరాబాద్లో హోం గార్డుగా పనిచేస్తున్నప్పటికీ, ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి రవాణా చేస్తున్నాడు. దశరథ్ మరియు సుధాకర్ యొక్క ప్రోత్సాహంతో ఈ గంజాయి రవాణాకి పూనుకున్నట్టు ప్రాధమిక విచారణలో తెలిసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించి, టెక్నికల్ గా దర్యాప్తు చేసి, గంజాయి రవాణాకి పాల్పడిన మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

నిందితుల నుండి సీజ్ చేసిన వస్తువులు:

1) 60 కేజీల గంజాయి ,2) ఒక ERTIGA కారు 3) మూడు స్మార్ట్ సెల్ ఫోన్లు.

తెలంగాణా రాష్ట్రం(Transporter)కేసు దర్యాప్తులో పాల్గొన్న వారు:

గన్నవరం SDPO చలసాని శ్రీనివాస్ పర్యవేక్షణలో, హనుమాన్ జంక్షన్ CI KVNN సత్యనారాయణ ఆద్వర్యంలో ఆత్కూరు SI సురేష్ చావా మరియు సిబ్బంది అయిన E పవన్ కానిస్టేబుల్స్ కుమార్, కొడాలి ఆంజనేయులు, అవుటపల్లి రామారావు, వాడవలస మోహన్ రావు.

నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ చూపిన ఆత్కూరు పోలిస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా SP ప్రత్యేకంగా అభినందించారు.