కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కార్యాలయంలో శనివారం దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్ లు పంపిణీ కార్యక్రమం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, బెల్ డైరెక్టర్ దామోదర్ బట్టాడ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 300 ట్రైసైకిళ్లను పంపిణీ చేసేందుకు బెల్ సంస్థ కార్యక్రమం చేపట్టింది దానిలోని భాగంగా శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యత లో భాగంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టి మంచి నాణ్యత గల ఎలక్ట్రానిక్ ట్రైసైకిళ్లు ఇవ్వటం ద్వారా దివ్యాంగుల ఎంతగానో ఉపయోగపడతాయని మంచి కార్యక్రమం చేపట్టారని ఈ సందర్భంగా భారత్ ఎలక్ట్రానిక్ సంస్థ కు అధికారులకు అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ దామోదర్ భట్టాడ ను కలెక్టర్ ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో వివిధ ఈ భాగాలకు సంబంధించిన జనరల్ మేనేజర్లు జితేంద్ర సింగ్, ఇంద్రజత్ సింగ్, రమ, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు