The Desk…Machilipatnam : మంగినపూడిలో బీచ్ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : మంగినపూడిలో బీచ్ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం ది డెస్క్ :

మంగినపూడి బీచ్ ఉత్సవాలను త్వరలో ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గతంలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎలా నిర్వహించారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తో బీచ్ ఉత్సవాలపై చర్చించి నిర్వహణ తేదీలు తదుపరి నిర్ణయించడం జరుగుతుందన్నారు.

ఈ ఉత్సవాలు ఒకరోజు నిర్వహించాలా లేదా 3 రోజులు నిర్వహించాలా అనే అంశంపై మంత్రితో చర్చిస్తామన్నారు. అలాగే గతంలో లాగా మ్యూజికల్ నైట్, ఫుడ్ స్టాల్స్, జెయింట్ వీల్, కొలంబస్ వంటి పిల్లలు ఆడుకునే ఎగ్జిబిషన్, హ్యాండీక్రాఫ్ట్స్, హెలికాప్టర్ రైడింగ్, గుర్రపు స్వారీ, వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, 100 అడుగుల దోసె, బీచ్ కబడ్డీ, మంచినీరు, మరుగుదొడ్లు ,గ్రీన్ రూములు, వేదిక తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే ఖర్చుల అంచనాల నివేదిక సిద్ధం చేయాలన్నారు.

గతంలో బీచ్ ఉత్సవాలకు విపరీతంగా పర్యాటకులు రావడంతో రాకపోకలు చాలా ఇబ్బంది పడిన దృష్ట్యా అది పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా పార్కింగ్ ప్రదేశం దూరంగా ఉంచి అక్కడి నుంచి చిన్న వాహనాలలో సముద్రతీరం వద్దకు చేర్చే ఏర్పాట్లు చేయాలని ఆలోచన ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

సమావేశంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు, జెడ్పిసిఈఓ కన్నమ నాయుడు, ఆర్డీవో స్వాతి, మెప్మా పీడీ సాయిబాబా, డిపిఓ అరుణ, పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, పంచాయతీరాజ్ ఎస్ ఇ రమణ రావు, మున్సిపల్ కమిషనర్ కాఫీ రాజు, డిఎస్పి సిహెచ్ రాజు, మెరైన్ పోలీస్ విభాగం ఎస్సై జగదీష్ చంద్ర బోస్ తదితర అధికారులు పాల్గొన్నారు.