The Desk … Machilipatnam : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి : సిపిఎం

The Desk … Machilipatnam : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి : సిపిఎం

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం మచిలీపట్నం రాజుపేట లో స్థానిక ప్రజలతో కలిసి సిపిఎం శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని గ్యాస్ బండ రేట్లు తగ్గించాలని నినాదాలు చేశారు. సిపిఎం నాయకులు బూర. సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు కొడాలి శర్మ, సిఐటియు కన్వీనర్ చిరువోలు జయరావు,టీ. చంద్రపాల్ ,పి. రాజు,కొడాలి సుజాత,చిరువోలు విజయలక్ష్మి , బూర భవాని, పి.స్రవంతి, పి.లావణ్య, పి.యేస్తేరమ్మ తదితరులు పాల్గొన్నారు.