The Desk…Machilipatnam : మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడులు

The Desk…Machilipatnam : మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడులు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ వై.శ్రీనివాస చౌదరి ఆదేశాల మేరకు.. సీఐ P.వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ని గూడూరు మండలం, R.V.పల్లి గ్రామంలో నాటుసారా తయారీకి ఉపయోగించు సుమారు 210 లీ. బెల్లపు ఊట తో మురాల.ఈశ్వరరావు ను, పోసిన వారి పాళెం గ్రామంలో సుమారు 300 లీ. బెల్లపు ఊట తో అమృత.నాగరాజు లను అదుపులోకి తీసుకొని, కేసులు నమోదు చేసి స్టేషన్ అప్పగించారు.

సదరు పులిసిన (సుమారు 500 లీ.) బెల్లపు ఊటను నేర స్థలము నందే ధ్వంసం చేయుటజరిగినది. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ M.రామ శేషయ్య, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.