కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
ఈనెల 13న మచిలీపట్నంలోని SSR డిగ్రీ కళాశాల నందు కంపెనీ స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించుటకు గాను ది.13.02.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు మచిలీపట్నంలోని SSR డిగ్రీ కళాశాల నందు “కంపెనీ స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేసారు.
ఈ డ్రైవ్‌లో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ లో షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ డ్రైవ్‌లో పాల్గొనవచ్చునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 23,000/- వేతనం తో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, EPF, ESI మరియు ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించబడతాయి. అదనంగా ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా అందించబడతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 200 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని హాజరు కావాలని కోరడమైనది. అలాగే అభ్యర్థులు ముందస్తుగా naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవలసిందిగా సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను వెంట తీసుకురావలసిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు 9966489796 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.

