కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు
సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ విసి హాలులో జిల్లా కలెక్టర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుండి 13 తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా, ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు మరియు ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

