The Desk … Machilipatnam : కె.డి.సి.సి.బ్యాంక్‌లోని రూ.35 కోట్ల కుంభకోణానికి విచారణ ఆదేశాలు జారీ..!!

The Desk … Machilipatnam : కె.డి.సి.సి.బ్యాంక్‌లోని రూ.35 కోట్ల కుంభకోణానికి విచారణ ఆదేశాలు జారీ..!!

🔴 కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

పెడన కేంద్ర సహకార బ్యాంక్, మచిలీపట్నం జవ్వారుపేట బ్రాంచిలలో 2020-21లో జరిగిన రూ.35 కోట్ల అవినీతికి రాష్ట్ర వ్యవసాయం & సహకార శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఐఏఎస్ విచారణకు ఆదేశించారు. గుంటూరు కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్‌కు నివేదిక సమర్పించమని దిగుమారి 22న ఉత్తర్వులు జారీ చేశారు.

ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌గౌడ్ పిర్యాదుపై దిగుమారి 19న చేసిన సమాచారం ఆధారంగా..వ్యవసాయ భూములను గృహాలుగా చూపి ఋణాలు మంజూరు చేసిన కేడీసిసిబి జిల్లా ఉన్నతాధికారులపై సహకార చట్టం సెక్షన్ 51 ప్రకారం 2022 మే 31న విచారణ పూర్తి. జిల్లా అధికారి నివేదిక సమర్పించినా.. క్రిమినల్, క్రమశిక్షణా చర్యలు లేకపోవడంతో సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్ ఇప్పటికీ కొనసాగుతున్నారు. దీనిపై బ్యాంకు జిల్లా ఉన్నతాధికారులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ మరియు సహకార ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి జంపాన ఫిర్యాదు చేశారు.

Probe Ordered into ₹35 Crore KDCSC Bank Fraud in Machilipatnam.

State Agriculture & Cooperation Principal Secretary B. Rajasekhar IAS has ordered an inquiry into a ₹35 crore scam at Pedana Central Cooperative Bank’s Javvarupeta branch during 2020-21. Guntur Cooperative Societies Commissioner must submit a report by January 22, following orders issued on the same day.The fraud surfaced via a January 19 complaint by Uyyuru activist Jampana Srinivas Gowd. KDCSCB officials allegedly approved loans by misrepresenting agricultural lands as homes, violating Cooperative Act Section 51. A 2022 probe concluded on May 31, but no criminal or disciplinary action followed, allowing CEO A. Shyam Manohar to continue. Activists demand accountability from top bank officials.