The Desk…Machilipatnam : పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

The Desk…Machilipatnam : పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా: మచిలీపట్నం : ది డెస్క్ :

ఉమ్మడి కృష్ణ -గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.

గురువారం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డిఆర్ఓ కే. చంద్రశేఖర రావులతో కలిసి జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ, పోలింగ్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు.

పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద, ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

అన్ని పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని, పోలైన ఓట్ల సంఖ్యను ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకునేలా పోలింగ్ అధికారులు సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.

హైని ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ డీకే బాలాజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా మాచవరం హైనీ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.