The Desk … Machilipatnam : ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీకి తావులేదు – జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు

The Desk … Machilipatnam : ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీకి తావులేదు – జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు

మచిలీపట్నం : కృష్ణాజిల్లా పోలీస్ : ది డెస్క్ :

ప్రజా సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు.

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీ కోసం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, వారితో ముఖాముఖి మాట్లాడి, ఒక్కో ఫిర్యాదును సవివరంగా పరిశీలించారు.

ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలు భయపడకుండా, ఎలాంటి సందేహం లేకుండా తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని పోలీస్ శాఖ ప్రజల సేవలోనే ఉందని తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదులను తక్షణ చర్యల కోసం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి పరిష్కారం చూపించాల్సిందిగా తెలిపారు.

ఈరోజు మొత్తం 25 ఫిర్యాదులు రాగా అందులో కొన్ని..

🔹పెనమలూరు నుండి నవీన్ అనే వ్యక్తి వచ్చి తను తనతో కలిసి పని చేసే వ్యక్తితో తన తమ్ముడికి ఉద్యోగం గూర్చి అడగగా, కొంత మొత్తం కడితే ఉద్యోగం వస్తుందని నమ్మ పలికి తన వద్ద నుండి 3 లక్షల రూపాయలు తీసుకున్నారని సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

🔹వడ్లమన్నాడు నుండి కవిత అనే వివాహిత వచ్చి తనకి వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందని వివాహం జరిగిన నాటినుండి తన భర్త అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

🔹మచిలీపట్నం నుండి సాల్మన్ అనే వ్యక్తి వచ్చి తన నివాస గృహానికి ఉన్న సరిహద్దుదారుడు తన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని, గోడ కట్టినప్పటికీ అక్రమంగా గోడను కూల్చివేసి తమపై భౌతికదాడికి పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.