The Desk … Machilipatnam : మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు

The Desk … Machilipatnam : మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో చోటుచేసుకున్న బాలల అక్రమ రవాణా ఘటనను మచిలీపట్నం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గత నెల 18వ తేదీన 10 సంవత్సరాల బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు బందర్ డీఎస్పీ రాజా తెలిపారు.

సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిని నంద్యాల ప్రాంతంలో గుర్తించారు. అక్కడ బాతుల పెంపకం నిర్వహిస్తున్న వ్యక్తులకు బాలుడిని అమ్మినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదే ప్రాంతంలో ఆ బాలుడితో పాటు మరో ఇద్దరు బాలికలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ బాలికల తల్లిదండ్రులను గుర్తించే దిశగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు పురుషులు, ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ కేసులు అత్యంత ప్రతిభ కనపర్చిన పోలీస్ అధికారులకు డిఎస్పి రివార్డ్ లు అందించారు