The Desk…Machilipatnam : వెలుగు ఫౌండేషన్ అధ్వర్యంలో పేదలకు రగ్గులు పంపిణీ

The Desk…Machilipatnam : వెలుగు ఫౌండేషన్ అధ్వర్యంలో పేదలకు రగ్గులు పంపిణీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మచిలీపట్నం నగరంలో ఇటీవల తీవ్రచలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరాశ్రయులు, పేద ప్రజలకు సహాయ హస్తం అందిస్తూ.. వెలుగు ఫౌండేషన్ సేవా కార్యక్రమం చేపట్టింది. సమాజానికి వెలుగు చూపాలనే సేవాస్ఫూర్తితో, మానవతా పరమార్థంతో సీనియర్ జర్నలిస్ట్, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు “చందమామ బాబు” ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాత్రి చేపట్టిన ఈ కార్యక్రమంలో బందరు డి.ఎస్.పి రాజా పాల్గొని బందర్ బస్టాండ్, బేబీ సెంటర్ వివిధ కూడళ్లలో చలితో వణుకుతున్న అభాగ్యులను స్వయంగా కలిసి, రగ్గులను అందజేశారు.

సందర్భంగా డి.ఎస్.పి రాజా మాట్లాడుతూ..“పేదలను అండగా నిలబెట్టడం మనందరి సామాజిక బాధ్యత. చలికాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మానవతా విలువలను మరింతగా ప్రతిబింబిస్తాయి అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 300 రగ్గులు పంపిణీ చేసిన వెలుగు ఫౌండేషన్ సంస్థని డిఎస్పి అభినందించారు

వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు మాట్లాడుతూ..సమాజం పట్ల ఉన్న మానవీయ బాధ్యతతో, అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడటం మా ఫౌండేషన్ లక్ష్యం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ద్వారా పేదల సాయం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి, విశ్రాంతి ఎంపీడీవో కంచనపల్లి కృష్ణమోహన రావు సభ్యులు, మాజీ సైనిక ఉద్యోగి జే.జగ్గారావు, కే. సీతారామయ్య, దుర్గ ప్రసాద్, పి‌హరికృష్ణ, స్మైల్ మోహన్, గంగ తదితరులు పాల్గొన్నారు