సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో…
లోకాయుక్త జస్టిస్ పి రజని ఆదేశాలతో..
దుర్వినియోగం కాబడిన డ్వాక్రా సంఘాల నిధులు రూ.62,71,243 /- లు వసూలు
🔴 కృష్ణాజిల్లా : ది డెస్క్ :

కృష్ణాజిల్లాలోని వివిధ 4 మండలాలలో రూ.87,67,513/-లు వివిధ డ్వాక్రా సంఘాల నిధులు దుర్వినియోగం కాగా.. రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. రజని ఆదేశాలతో రూ.62,71,243 /- లు తిరిగి వసూలు కాబడ్డాయి.

ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్..రాష్ట్ర లోకాయుక్తకు 2023లో చేసిన పిర్యాదు మేరకు సెర్ఫ్ సి.ఇ.వో వాకాటి కరుణ, కృష్ణాజిల్లా డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరక్టర్ విచారణ జరిపి రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం రూ.62,71,243 /- లు తిరిగి వసూలు చేసారు.

1) కోడూరు మండలంలో రూ.24,91,202/-
2) నాగాయలంక మండలంలో రూ.40,45,941/-
3) నందివాడ మండలంలో రూ.6,41,440/-
4) మచిలీపట్నం మండలం, పెదపట్నంలో రూ.15,88,930/-

మొత్తం రూ.87, 67, 513/-లు నిధులను డ్వాక్రా సంఘాల లీడర్లు దుర్వినియోగం చేసారు. వీటికి సంబంధించి కోడూరు, నాగాయలంక మండలాల పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఆర్.లు నమోదు చేయబడగా… సంబంధించిన సి.సిలు సస్పెండుకు గురికావడం గమనార్హం.

