The Desk …Kovvuru: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. కొవ్వూరులో ర్యాలీ

The Desk …Kovvuru: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. కొవ్వూరులో ర్యాలీ

🔴 తూగో : కొవ్వూరు : ది డెస్క్ :

NRSM–2026 కార్యక్రమాన్ని సోమవారం కొవ్వూరులో నిర్వహించారు. కొవ్వూరు APSRTC బస్‌స్టాండ్ సెంటర్ నుంచి నగర వీధుల గుండా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి వరకు ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శాసన సభ్యులు స్వయంగా ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.

సందర్భంగా శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ..

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం అనివార్యమని తెలిపారు. వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, చిన్న పిల్లలకు భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు కె.వి.వై.ఎస్. ప్రసాద్, సి.హెచ్. సంపత్ కుమార్, ఎం. రవి కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. లక్ష్మీ ప్రవీణ, స్థానిక డీఎస్పీ జీ. దేవకుమార్, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం, ఎస్‌ఐ అలెగ్జాండర్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు కాంతామణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.

MLA Flags Off Road Safety Rally in National Campaign

As part of the National Road Safety Month celebrations, the NRSM-2026 program unfolded in Kovvur on Monday. A rally featuring two-wheeler riders commenced from the APSRTC bus stand, weaving through city streets to the Rail Cum Road Bridge, aimed at raising public awareness on road safety, transport officials said.

Kovvur MLA Muppidi Venkateswara Rao graced the event as chief guest, flagging off the rally and personally joining on a two-wheeler to spread safety messages. Speaking on the occasion, he urged everyone to strictly follow traffic rules, mandating helmet and seatbelt use, speed control, avoiding drunk driving, and child safety measures to curb accidents.

The event saw Motor Vehicles Inspectors K.V.Y.S. Prasad, C.H. Sampath Kumar, M. Ravi Kumar, Assistant MVI V. Lakshmi Praveen, DSP G. Devakumar, Town Circle Inspector Vishwam, SI Alexander, TDP leaders Kanthamanu Ramakrishna, Maddipati Shivaramakrishna, Surapaneni Chinni, and numerous riders pledging road safety.