The Desk…Kanipakam : రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలకు పాలకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల : మంత్రి ఆనం

The Desk…Kanipakam : రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలకు పాలకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల : మంత్రి ఆనం

  • ఆధ్యాత్మిక శోభతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఆధ్యాత్మికతను అందజేయడమే కూటమి ప్రభుత్వము లక్ష్యం
  • రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుంది

🔴 చిత్తూరు జిల్లా : కాణిపాకం : ది డెస్క్ :

రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుందిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కాణిపాక ఆలయము నందు ఈరోజు నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాలు ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో పరివేక్షించడానికి, బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు లేకపోతే సహచర మంత్రివర్గాన్ని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం పంపడం ఆనవాయితి.

అందులో భాగంగా నేడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. గడిచిన సంవత్సరం వర్షాల ప్రభావంతో మేము రాలేకపోవడంతో స్థానిక శాసనసభ్యున్ని పట్టు వస్త్రాలు సమర్పించమని ప్రభుత్వం నుండి ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్వామి వారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది.

ఎటువంటి విజ్ఞాలు కలగకుండా సమ సమాజ స్థాపన జరగాలని కోరుకోవడం జరిగింది స్వామి వారి ఆశీస్సులు తోటి.. నేడు కాణిపాకంలో అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 4 కోట్లు రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాలతో అనేక ఆలయాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కలిపి ఎన్నో ఆలయాలు పున నిర్మాణం కోసం శ్రీకారం చుట్టడం జరిగింది.

చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు పునర్నిర్మాణ కార్యక్రమం జరిపి ఆలయంలో రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఆగమపండితుల ఆదేశాల మేరకు మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అర్చకులకు గతంలో పదివేల రూపాయల పారితోషకం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక 15వేలకు పెంచడం జరిగింది.

ధూప దీప నైవేద్యాలకి గతంలో 5000 రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వంలో 10,000 పెంచడం జరిగింది రాష్ట్రంలో 5250 ఆలయలకు దూప దీప నైవేద్యం అమలు చేయడం జరుగుతుందినాయి బ్రాహ్మణుల ఆదాయాన్ని పెంచడం కోసం 25వేల రూపాయలు ప్రతినెల వారికి పారితోషకం ఇవ్వడం జరుగుతుంది వేద విద్య అభ్యసించిన వేద విద్యార్థుల కు సంభవన కింద నెలకు 3000 రూపాయలుఇవ్వడం జరుగుతుంది.

దేవదాయ శాఖలో 500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అందులో అర్చకుల మొదలు అన్నీ విభాగాల నుండి ఖాళీలు ఉన్నాయిత్వరలోనే దేవాదాయ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలచేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళల్లో పాలిస్తున్న చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజానీకానికి ఆశీస్సులు అందించాలని కాణిపాక వరసిద్ధి వినాయకుని కోరుకోవడం జరిగింది తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పూతల పుట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు.