చిత్తూరు జిల్లా, కాణిపాకం/కైకలూరు : కాణిపాకం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డా. కామినేని శ్రీనివాస్ దర్శించుకున్నట్టు ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా ఆలయ అధికారులు కామినేనికి స్వగతం పలికి స్వామివారి దర్శనం చేయించి వేదపండితుల ఆశీర్వచనం అందించారు. కామినేని మాట్లాడుతూ.. NDA ప్రభుత్వంలో కైకలూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
