The Desk…Kalidindi : లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు

The Desk…Kalidindi : లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు

ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగంగా అమలు జరుగుతోంది. తెదేపా అధినేత చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కామినేని ఆదేశాలు మేరకు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్లు పంపిణీ చేపట్టారు.

మంగళవారం కలిదిండి గ్రామంలోని 1వ వార్డు, ఆదర్శనగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో కలిసి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లంక రత్నారావు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రత్నారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్లు నేరుగా లబ్ధిదారులకి పంపిణీ చేస్తున్నామన్నారు. దీనిద్వారా ముఖ్యంగా దివ్యాంగులకు, వృద్ధులకు, పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎండి. రహమతుల్లా, సానా. సతీష్, ఎండి. ఫారుక్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.