ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK NEWS :
మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి. రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కూటమి నేతలు కోరారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకుడు ఆలపాటి. రాజేంద్రప్రసాద్ ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని.. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటిపై వేసి గెలిపించాలని బుధవారం కూటమి నేతలు ఎమ్మెల్సీ ఓటర్లను అభ్యర్థించారు.
కార్యక్రమంలో నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ లంకా. రత్నారావు, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు అంకాల. దుర్గాప్రసాద్, చిట్టూరి రవీంద్ర, చక్క. జగన్, కోక. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.