ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK NEWS :
గుట్టు చప్పుడు కాకుండా పేకాట జూదం ఆడుతున్న ఏడుగురు పేకాటరాయుళ్లను మంగళవారం కలిదిండి పోలీసులు అరెస్టు చేశారు.
ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పడమటిపాలెంలో పేకాటజూదం ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడి చేశామని, దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని,
వారి వద్ద నుండి రూ.3,200ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎవరైనా కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే వారి సమాచారం పోలీసులకు తెలియచేయాలన్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.