The Desk…Kalidindi :  కలిదిండి పోలీసుల అదుపులో అక్రమ మద్యం కలిగి ఉన్న మహిళ

The Desk…Kalidindi : కలిదిండి పోలీసుల అదుపులో అక్రమ మద్యం కలిగి ఉన్న మహిళ

ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK :

అక్రమ మద్యం కలిగి ఉన్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నామని కలిదిండి ఎస్సై వి. వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. కలిదిండి మండలం కొండంగి గ్రామ శివారు కొండంగి పల్లెపాలెంలో చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం కలిగి ఉండి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి ఓ దుకాణంపై దాడి చేయగా.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని 7 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుమన్నారు.

చట్ట విరుద్ధంగా ఎవరైనా అక్రమ మద్యం కలిగి ఉన్నా.. విక్రయిస్తున్నట్టు తెలిసినా కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.