ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

మార్చి 1, 2, 3 తేదీలలో నిర్వహించనున్న మేరీమాత మహోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ నేతృత్వంలో అధికారులు కలిదిండిలోని రోమన్ కాథలిక్ చర్చ్ను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముండటంతో జనసమ్మర్థం నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించి తగు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

కార్యక్రమంలో కలిదిండి ఎస్సై వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, చర్చ్ ఫాదర్ తదితరులు పాల్గొన్నారు.

