ఏలూరు జిల్లా : కలిదిండి/కోరుకొల్లు : ది డెస్క్ :
మాజీ మంత్రి పేర్ని నాని కి BC లు అంటే చులకనగా ఉంది అని కైకలూరు నియోజకవర్గ బీసీ నాయకులు మండిపడ్డారు. శనివారం కలిదిండి మండలం, కోరుకొల్లు నుండి ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుబోయిన శ్రీనివాసరావు (BSR) మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి CI ఏసుబాబు మీద చేసిన అనుచిత వ్యక్యులు తగదని, ఒక మంత్రిగా పని చేసిన మీరు విలువలతో కూడిన రాజకీయం చేయాలి కానీ ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించకూడదని ఆయన అన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని CI ఏసుబాబు కు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు,
కార్యక్రమంలో కొచ్చెర్ల మాజీ సర్పంచ్ బుసనబోయిన పెర్రాజు, కొమరపాలేపు సత్యనారాయణ, కైకలూరు నియోజకవర్గ యాదవ సంఘం ఉపాధ్యక్షుడు బుసనబోయిన అశోక్ కుమార్, నియోజకవర్గ తెలుగుయువత ప్రధానకార్యదర్శి నున్న సుబ్రహ్మణ్యం, బుసనబోయిన మణికంఠ, బోయిన మస్తాన్ రాజు, నల్లిబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.