ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :
మండల డిప్యూటీ తహసిల్దార్ గా శుక్రవారం ఎం. గీత బాధ్యతలు స్వీకరించారు.
ఈ మేరకు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి కలిదండి డిప్యూటీ తహసిల్దార్ గా ఎం. గీతను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో చాట్రాయి మండలం నందు డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేసి, డిప్యూటేషన్ పై కలిదిండి మండలానికి వచ్చారు.
ఈ సందర్భంగా కలిదండి డీ.టీ గీత మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.