The Desk…Kalidindi : కలిదిండి పోలీస్ స్టేషన్ ను ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ

The Desk…Kalidindi : కలిదిండి పోలీస్ స్టేషన్ ను ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ

ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

మండల కేంద్రంలోని స్థానిక కలిదిండి పోలీస్ స్టేషన్ ను ఏలూరు డిఎస్పి డి. శ్రావణ్ కుమార్ బుధవారం సర్ప్రైజ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి స్టేషన్లోని అన్ని రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో జరిగే ప్రతి యొక్క విశేషాలను పార్ట్-5 నందు తప్పనిసరిగా వ్రాయాలని సూచించారు. సిబ్బంది అందరినీ పిలిచి వారి పనితీరు గురించి మాట్లాడి ప్రతి ఒక్కరు గంజాయి మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని CCTNS వర్క్ అందరూ తెలుసుకోవాలని సూచించారు.

అదేవిధంగా శక్తి టీం మండలంలోని ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో ఇంట్రాక్ట్ కావాలని.. వారికి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని.. వాటిని SHO దృష్టికి తేవాలన్నారు. మండలంలో సీసీ కెమెరాలు ఎక్కువగా ఉండేలాగా చూడాలని సూచించారు. అలాగే నెంబర్ ప్లేట్ లేని మరియు రికార్డ్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.

కలిదిండి మండలంలోని కోరుకొల్లు గర్ల్స్ హాస్టల్ ను డిఎస్పీ సందర్శించి అక్కడ విద్యార్థినిలతో మాట్లాడి, వారికున్న సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కోరుకొల్లు బాలికల హాస్టల్ నందు పోలీసు వారు ఏర్పాటు చేసిన సీసీటీవీ ల పనితీరును పరిశీలించి హాస్టల్ వద్ద ఏమైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావలన్నారు.

కార్యక్రమంలో కైకలూరు రూరల్ సిఐ రవికుమార్, మరియు కలిదిండి ఎస్ఐ వి. వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.