The Desk…Kalidindi : కలిదిండి పోలీసుల అదుపులో ఇద్దరు ద్విచక్ర వాహనాల చోరీ నిందితులు

The Desk…Kalidindi : కలిదిండి పోలీసుల అదుపులో ఇద్దరు ద్విచక్ర వాహనాల చోరీ నిందితులు

  • 5 ద్విచక్ర వాహనాల రికవరీ

ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

ఏలూరు జిల్లా ఎస్పీ KPS కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ D. శ్రావణ్ కుమార్ అధ్యక్షతన, కైకలూరు రూరల్ CI V. రవికుమార్ సూచనల మేరకు, కలిదిండి పోలీస్ స్టేషన్ SI V. వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి మండలంలో జరుగుతున్న వరుస మోటార్ సైకిళ్ళ దొంగతనాల పై ప్రత్యెక నిఘా పెట్టి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుండి సుమారు Rs.3,50,000/- విలువ చేసే 5 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన కలిదిండి పోలీస్ స్టేషన్ SI V. వెంకటేశ్వరరావు, ASI K. వెంకటేశ్వరరావు, PC’s B. రమేష్, D. వడ్డికాసులు, మరియు HG కట్టా శ్రీను లను కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ప్రత్యేకంగా అభినంధించారు.