ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK :
ఇది మంచి ప్రభుత్వం…ప్రజా ప్రభుత్వం…
ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అడుగులు…
కలిదిండి మండలం భాస్కరరావుపేటలో జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్…
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం రెండు సమాంతరంగా అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. శనివారం కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం భాస్కరరావుపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాకూడా ఇంత పెద్ద మొత్తంగా ఎన్.టి.ఆర్. భరోసా సామాజికి పెన్షన్లు పలు కేటగిరీల కింద పేదలకు ప్రతినెలా 1వ తేదీ తెల్లవారుజామునుంచే సచివాలయాల సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రే స్వయంగా ఉదయం 6 గంటలకే పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ చేస్తూ అందరికీ ఆధర్శంగా నిలుస్తూ అధికారులకు, సిబ్బందికి ఎంతో స్పూర్తిని అందిస్తున్నారన్నారు. అంతే కాకుండా విపత్తుల సమయంలో ముఖ్యంగా గోదావరి వరద, కొల్లేరు వరద సమయాల్లో కూడా ప్రతిరోజు కలెక్టర్లకు స్వయంగా ఫోన్ చేసి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అవసరమైన దిశా, నిర్ధేశం చేయడం జరిగిందన్నారు.
ఈ రోజుకూడా ముఖ్యమంత్రి టెలీఫోన్ ద్వారా ఉప్పుటేరు, కొల్లేరు ముంపు సమస్యలపై ఆరా తీసి సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ సహాయం చేసేందుకు వినూత్న మార్గాలు అన్వేషించే గౌ. ముఖ్యమంత్రి వర్యులను మనం అందరం స్పూర్తిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇలాంటి మంచి అనుభవం దూరదృష్టి వున్న ప్రభుత్వంలో పని చెయ్యటం చాలా సంతోషంగా వుందన్నారు. ప్రతి ఆలోచన అభివృద్ధి వైపే కొనసాగుతున్నాయన్నారు. ఇదే స్పూర్తితో ప్రభుత్వం అందిస్తున్న మంచి పాలనతో ఏలూరు జిల్లాని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
కైకలూరు శాసన సభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులకు 100 రోజులలో చేసిన 100 మంచి పనులను వివరించారు. గత ప్రభుత్వం అన్ని శాఖలను నిర్వీర్యం చేసింది అభివృద్ధి లేక గ్రామ పంచాయితీలు విలవిలలాడాయన్నారు.
ప్రస్తుతం ఎన్ డిఎ ప్రభుత్వం 100 రోజులలో ప్రతి హామీ నెరవేర్చే విధంగా అడుగులు వేస్తుందన్నారు. త్వరలోనే ప్రతి పేదవాడి కష్టాలు తొలగి అందరూ సంతోషంగా వుండే రోజులు వస్తాయన్నారు.
అలానే ప్రతి నాయకులు, కార్యకర్తలు ప్రజలకి ప్రతి పధకం వివరించి ఎన్ డిఎ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. ఇటీవల వరదల కారణంగా ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారో చూసామని, గౌ. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి సమర్ధవంతంగా వరద పరిస్ధితులను సమీక్షిస్తూ పెద్దఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టారన్నారు. కైకలూరు నియోజకవర్గంలో వరద బాధితులకు 24 గంటల్లో 50 టన్నుల బియ్యాన్ని అందించి పనిచేసే ప్రభుత్వంగా ప్రజల్లో గుర్తింపు పొందిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ విడుదల చేయడం, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, ఎన్ టిఆర్ భరోసా సామాజిక భధ్రత పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్దరణతోపాటు గత ప్రభుత్వం బకాయిపట్టిన ధాన్యం కొనుగోలు బాకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకోవడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు. ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.