🔴 కాకినాడ జిల్లా: కాకినాడ : ది డెస్క్ :

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సంఘటితం కావాలని బీసీ/ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం అన్నారు. కాకినాడ జయ రెసిడెన్సిలో ఈరోజు కాకినాడ జిల్లా బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసంశెట్టి కామేశ్వరరావు అధ్యక్షతన బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం విశిష్ట అతిథులుగా డ్వామా, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ..
ది.4.1.2026 ఆదివారం నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2026 సంవత్సరపు డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమానికి మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక
ఆహ్వనితులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చేనాయుడు, హౌసింగ్ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి సవిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, ఎన్. ఆర్. ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారని తెలిపారు.
ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ..
హక్కుల సాధన కోసం ఉద్యోగులు అందరు ఐక్యతగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులందరూ జనవరి, 4, 2026 తేదీన వేలాదిగా విజయవాడ తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గుత్తుల వీరబ్రహ్మం కోరారు. కాకినాడ జిల్లా బీసీ ఓబిసి ఉద్యోగులు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా రాష్ట్ర మహాసభ బ్రోచర్లు ఘనంగా ఆవిష్కరించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జోగా రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అద్దంకి వెంకన్న బాబు, రామ రాఘవ, ముల్లు సత్యనారాయణ, గౌరవ సలహాదారులు దొమ్మేటి సుధాకర్, ప్రొఫెసర్ ఇళ్ళ దోసగిరిరావు సిద్ధి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షులు కడలి నాగరాజు,వంచర్ల వీరభద్రరావు, డాక్టర్ ఏడుకొండలు, నక్క వెంకటేశ్వర్రావు, వీరవల్లి గోపికృష్ణ, మురళి, తేజ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
BC Employees Urged to Unite Across Government Departments
➖Guttula Veerabrahmam, State President, BC/OBC Employees Welfare Association.
All government employees working in various departments across the state should unite for their welfare, said Guttula Veerabrahmam, State President of the BC/OBC Employees Welfare Association.
The call came at a district-level meeting of the association held at Jay Residency here today, chaired by Kakinada District President Vasanshetti Kameswar Rao. State President Veerabrahmam attended as chief guest, while Dwama Assistant Project Director Tutika Srinivasa Viswanath was the special guest and spoke on the occasion.
Addressing the gathering, Veerabrahmam announced a major event on January 4, 2026 (Sunday) at Vijayawada’s Tummlapalli Kalakshetram, where the association’s 2026 diary and calendar will be released. HRD and IT Minister Nara Lokesh will be the chief guest, he said. TDP State President Palla Srinivasa Rao will attend as special guest, with special invitees including Agriculture Minister Kinjarapu Atchennaidu, Housing Minister Kolusu Parthasarathy, Excise Minister Kollu Ravindra, Revenue Minister Anagani Satya Prasad, BC Welfare Minister Savita, Health Minister Satya Kumar Yadav, Labour Ministers Vasanshetti Subhash, and NRI Empowerment Minister Kondapalli Srinivasa.
APD Srinivasa Vishwanath urged employees to stay united to secure their rights. He called on all BC employees from the erstwhile East Godavari district to converge in thousands in Vijayawada on January 4 to make the event a grand success.
The state mahasabha brochures were released by the state president during the meeting. Key participants included District General Secretary Joga Ramakrishna, state executive members Addanki Venkanna Babu, Rama Raghav, Mullu Satyanarayana, advisors Dommeti Sudhakar, Prof. Illa Dosagiri Rao, Siddi Venkateswara Rao, city presidents Kadali Nagaraju, Vanacharla Veerabhadra Rao, Dr. Edukondaalu, Nakka Venkateswara Rao, Veeravalli Gopikrishna, Murali, Teja, and other executives.

