🔴 కాకినాడ జిల్లా : కాకినాడ కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :
2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో రాష్ట్రంలో రైతుల నుండి 50 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యం చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, విసి ఎండి డా. మనజీర్ జిలాని సమూన్ లతో కలిసి పూర్వ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కాకినాడ, డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్ లు, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డియంలు, డిఎస్ఓలు, వ్యవసాయ, రెవెన్యూ, సహకార, మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో ప్రాంతీయ సమావేశం నిర్వహించి 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళిక పై చర్చించి లక్ష్యాలను నిర్ధేశించారు.

ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు గత యేడాది ఖరీఫ్ సీజను సేకరణలో తీసుకున్న మంచి ప్రణాళికలు చేపట్టామని, రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్నికి 48 గంటలలోపే చెల్లింపులు చేపట్టామని, గత ఖరీఫ్, రబీ సీజన్లలో 7.67 లక్షల మంది రైతుల నుండి 12,557 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
అంతేకాక గత ప్రభుత్వం రైతులకు బకాయిపెట్టి వెళ్లిన 1674 కోట్ల మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వం రైతులకు చెల్లించిందన్నారు. రబీలో స్థానిక సమస్యల కారణంగా చిన్నచిన్న సమస్యలు ఏదురైయ్యాయని, అవి 2025-26 ఖరీప్ ధాన్యం సేకరణలో గోనె సంచులు, రవాణా వాహనాల పరంగా ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు కార్యాచరణతో సంసిద్దం కావాలని అధికారులను ఆదేశించారు.
ఈ యేడాది ఖరీఫ్ పంటలు ముందే అక్టోబరు రెండవ వారానికే కోతకు వస్తున్నందున అన్ని జిల్లాలో ధాన్యం మార్కెట్ కు వచ్చేందుకు నాలుగైదు రోజుల ముందే సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని, ఇందుకు సిబ్బందికి అవసరమైన పిపిసి కేంద్రాల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను సెప్టెంబరు నెలాఖరు లోగా పూర్తి చేయాలని సూచించారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలోని 1234 రైతు సేవా కేంద్రాలను, 691 రైసు మిల్లులను అనుసంధానం చేసి సేకరణ ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సమాయత్తం కావాలన్నారు. గత ఖరీఫ్ సీజనలో రాష్ట్రంలో 35.94 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేసామని, అధిక దిగుబడుల అంచనా, కేంద్రం జారీచేసిన అదనపు కేటాయింపులతో 2025-26 ఖరీఫ్ సీజనులో రాష్ట్ర చరిత్రలో తొలి సారి అత్యధికంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేందుకు లక్ష్యం చేపట్టామన్నారు.
ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి జిల్లాలో 5 లక్షలు, బిఆర్ఏ కోనసీమ జిల్లాలో 3.50 లక్షలు, కాకినాడ జిల్లాలో 3 లక్షలు, ఏలూరు జిల్లాలో 4 లక్షలు వెరసి 19.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి గోదావరి జిల్లాలోనే సేకరణ జరగనుందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వరి సాధారణ రకాలకు 2369 రూపాయలు, ఏ గ్రేడ్ రకాలకు 2389 రూపాయలకు పెంచి మద్దతు ధరలను ప్రకటించిందన్నారు.
రాష్ట్రంలో రైతులను నుండి కొనుగోలు చేసిన ఫైన్ రకాల ధాన్యాన్ని 41 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భోజన పధకానికి బియ్యంగా సరఫరా చేస్తున్నామని, ఈ ఖరీఫ్ సీజనులో రైతుల నుండి ఫైన్ రకాల ధాన్యం సేకరకణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి మిల్లర్ల నుండి బ్యాంకు గ్యారెంటీ లను ఆన్లైన్ ద్వారా సేకరిం చాలచి మంత్రి తెలిపారు.
సమావేశంలో తొలుత పౌర సరఫరాల సంస్ధ విసి ఎండి డా. మనజీర్ జిలాని సమూన్ ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంస్థ రూపొందించిన ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆన్లైన్ పోర్టల్ గురించిపై అధికారులకు వివరించారు. ఈ పోర్టల్ లో రైతు సేవా కేంద్రాలు, సిబ్బంది, కొనుగోళ్లు చెల్లింపులుఫష వాహనాలు వెబ్సైట్లు మాయిశ్చర్ మీటర్లు, గోనెసంచులూ మిల్లులు ఫీడ్ బ్యాక్ తదితర సమాచారాన్ని పొందుపరచాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, బిఆర్ అంబేత్కర్-కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా డియం గణేశ్ కుమార్, ఏలూరు జిల్ల్ డియం పిఎస్ఆర్ మూర్తి ఆయా జిల్లాలలో 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణకు చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు.