🔴 కాకినాడ జిల్లా : కాకినాడ : ది డెస్క్ :

మూడు తరరాలుగా సీతారాముల సేవలో పిచ్చుక వంశీయులు
శ్రీరామ నవమి పురస్కరించుకుని 110వ సీత రాముల వారి కళ్యాణం పిచ్చుక వీర నాగేశ్వరావు, వీర భానుమతి దంపతులు కాకినాడ టౌన్ ఆంజనేయ నగర్ లోని తమ స్వగృహంలో శోభాయమానంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం వీర నాగేశ్వరావు తాత, నానమ్మ నాగేశ్వరావు, సూరమ్మ దంపతులు 110 సంవత్సరాల క్రితం శ్రీరామ నవమి రోజున సీతారాములవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభించి ప్రతి ఏటా నిర్వహిస్తే తదనంతరం వారి తనయుడు వీర నాగేశ్వరావు తండ్రి వీర్రాజు, పద్మావతి దంపతులు కుటుంబ సంప్రదాయాన్ని సుమారు 50 సంవత్సరాలు కొనసాగించారు. అనంతరం తండ్రి వీర్రాజు 1987లో మరణించగా వీర నాగేశ్వరావు, వీర భానుమతి దంపతులు ప్రతి ఏటా సీతా రాముల కల్యాణ మహోత్సవం శ్రీరామ నవమినాడు కొనసాగిస్తూ వస్తున్నారు.
ఈ సందర్బంగా పిచ్చుక నాగేశ్వరావు మాట్లాడుతూ :
పుష్కరకాలం శ్రమించి భక్తితో శ్రీరామ కోటి 2017లో పూర్తి చేసి భద్రాద్రి రాముల వారికి అంకితం ఇవ్వడం జరిగిందని, శ్రీపరాభవనామ సంవత్సరంలో భక్తులు శ్రీరామనామ జపం చేయడం శుభప్రథమని అని అన్నారు. సీతారాముల వారి కళ్యాణం ధవళ కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో జరగగా కార్యక్రమంలో రంపచోడవరం ద్వామా ఏపీడీ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, శైలజ దంపతులు, వినోదబాబు, తులసి బృందదేవి పలువురు పాల్గొన్నారు.

