- జనసేన నాయకుడు (కొల్లి బాబి) పుట్టినరోజు సధర్భంగా 400 మందికి అన్నదానం
- బాబి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు కూటమి నేతలు, అభిమానులు
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కైకలూరు నియోజకవర్గంలో గురువారం 184వ రోజుకు చేరింది. నేడు అన్నదాతగా కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కొల్లి వర ప్రసాద్ (జనసేన బాబీ) జన్మదినం సదర్భంగా.. సుమారు 400 మందికి అన్నదానం జరిపించారు. మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, పలువురు కూటమి నేతలు బాబి కి పుష్ప గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబీ) మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి లుమాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 184వ రోజుకు చేరుకోవడం చాల ఆనందంగా ఉందని.. దాతలను మరొక్కసారి అభినందిస్తున్నామని తెలిపారు. జనసేన బాబి పుట్టిన రోజును ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను అధికారికంగా ప్రారంభించేంతవరకు ఇలాగే కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో కైకలూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు భలే యేసు రాజు, సేన దినపత్రిక అధినేత A.V. శ్రీనివాసరావు, జనసేన వీర మహిళ తోట లక్మి , శొంఠి రాజీ, జనసేన నాయకుడు కోటి నాగరాజు, తులసి పూర్ణ, పుప్పాల సూర్యప్రకాష్ , బొక్క వెంకటరావు, దావు నాగరాజు తదితర ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.