ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

నియోజకవర్గ కేంద్రం కైకలూరు స్థానిక తాలూకా సెంటర్లో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
ఈ వేడుకలో ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలు విట్టల్ రావు, జనసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక శాఖ వెల్ఫేర్ డైరెక్టర్ నల్లగోపుల చలపతి, తెదేపా నేత భలే యేసు రాజు, జనసేన నాయకులు కొల్లి బాబి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరబత్తిన సుధ, తెదేపా పార్టీ సహ కన్వీనర్ బొమ్మానబోయిన విజయలక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కట్టా గోపి, పార్టీ నాయకులు జక్కుల విజయ్ కుమార్, రాష్ట్ర బీసీ నాయకులు కట్టా రాఘవులు, పెదలంక సహకార బ్యాంకు చైర్మన్ బళ్లా రాజు, మండల ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షులు కూరెళ్ల ఏడుకొండలు, గుడివాడ గణేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎంపీ సేవలను కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

