ఏలూరు జిల్లా, కైకలూరు : THE DESK : నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాలలో ఆదివారం YCP శాసనమండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పర్యటించారు. దీనిలో భాగంగా ముంపునకు గురైన తమరకొల్లు – వేమవరప్పాడు రహదారిని ఆయన పరిశీలించారు. జయమంగళ మాట్లాడుతూ… ఎగువ నుండి వస్తున్న వరద వలన కొల్లేరు పరిసర ప్రాంతాలకు ప్రమాదం పొంచివుందన్నారు. అలాగే కైకలూరు నియోజకవర్గంలోని ప్రధాన డ్రెయిన్లయిన కొమ్మిలేరు, పుల్వా, పోలరాజు, వార్లకోడు, చిన్నకొమ్ములేరు, శ్యాంపు డ్రైనులో మేటవేసిన గుర్రపుడెక్కను వెంటనే తొలగించే విధంగా యుద్ధప్రాతిపదికన తగు చర్యలు తీసుకొని కైకలూరు నియోజకవర్గాన్ని వరద ముంపు బారిన పడకుండా చూడాలని అధికారులను, స్థానిక కూటమి నాయకులను ఓ ప్రకటనలో రమణ కోరారు.
