The Desk …Kaikaluru : కైకలూరు పట్టణంలో దొంగతనాల నివారణపై పోలీసుల అవగాహన కార్యక్రమం

The Desk …Kaikaluru : కైకలూరు పట్టణంలో దొంగతనాల నివారణపై పోలీసుల అవగాహన కార్యక్రమం

ఏలూరు జిల్లా : కైకలూరు టౌన్ : ది డెస్క్ :

వేసవి సెలవుల నేపథ్యంలో దొంగతనాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కైకలూరు టౌన్ పోలీసులు బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మార్గదర్శకత్వంలో జరిగింది.

టౌన్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకట కుమార్ తన సిబ్బందితో కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మైక్ ద్వారా ప్రకటనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.

వేసవి సెలవులు సందర్భంగా ఇళ్లను ఖాళీగా ఉంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.