ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ప్రముఖ సీనియర్ న్యాయవాది కారి శరత్ బాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. మండలంలోని ఆటపాక గ్రామంలో శరత్ బాబు పెద్దకర్మ కార్యక్రమం ను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కో-ఆర్డినేషన్ కో-కన్వీనర్ బొమ్మనబోయిన విజయలక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టిడిపి నాయకులు వీరాబత్తిన సుధ, కైకలూరు కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పి. పవన్ కాంత్, టిడిపి మైనారిటీ నాయకులు హబీబ్ తదితరులు పాల్గొని శరత్ బాబు సేవలను స్మరించుకున్నారు.

